అడ్రినలిన్ లేదా ఎపినెఫ్రీన్ శ్వాస ప్రక్రియ లాంటి శరీరాంతరంగ వ్యవస్థను నియంత్రించే ఒక హార్మోను, ఔషధం. సాధారణంగా రెండు అడ్రినలిన్ గ్రంథులు, లేదా మజ్జాముఖము లేదా ఉపమస్తిష్కము అనబడే మెడుల్లా అబ్లాంగేటాలోని న్యూరాన్లు దీనిని ఉత్పత్తి చేస్తాయి.
ఇది చాలా జంతువుల్లో, కొన్ని ఏకకణజీవుల్లో కూడా కనిపిస్తుంది. పోలిష్ శాస్త్రవేత్త నెపోలియన్ సైబుల్స్కి దీన్ని 1895లో మొట్టమొదటిసారిగా గుర్తించాడు.
విపరీతమైన అలర్జీ, గుండెపోటు, ఉపరితల రక్తస్రావం లాంటి అనేక సమస్యలను పరిష్కరించడానికి దీనిని మందుగా వాడుతారు.